ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

ABN, First Publish Date - 2022-11-19T00:03:43+05:30

నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

నంగునూరు మండలం పాలమాకుల కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంగునూరు, నవంబరు 18: నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యాసంగి కమీషన్‌కు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కౌలు రైతులకు ఆధార్‌లింక్‌ వేలిముద్రలో సాంకేతిక సమస్య ఉత్పన్నం అవుతుందని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్య పునరావృతం కాకుండా చూడాలని డీఆర్డీఏ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక సర్పంచ్‌కుమార్‌, ఎంపీటీసీ తులసి పరమేశ్వర్‌, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాగుల సారయ్య, వేణు, ఐలయ్య, కనకరాజు, వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి అనిత పాల్గొన్నారు.

రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

సిద్దిపేట రూరల్‌: మండలంలోని రావురుకుల గ్రామం టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎర్పుల రాజయ్య ఇటీవల మృతి చెందగా, కుటుంబసభ్యులను శుక్రవారం మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుంటుంబ సభ్యులకు అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. మంత్రి వెంట సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు శేరుపల్లి యాదగిరి, ఆత్మకమిటీ చైర్మన్‌ ప్రభాకర్‌ వర్మ, గ్రామ సర్పంచ్‌ కవిత, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

Updated Date - 2022-11-19T00:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising