ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు మంత్రి KTR భూమి పూజ

ABN, First Publish Date - 2022-06-22T18:33:15+05:30

జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ బుధవారం భూమి పూజ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ (KTR) బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... రక్షణ రంగం పరిశ్రమల హబ్ హైదరాబాద్ అని అన్నారు. డిఫెన్స్ కారిడార్‌ను హైదరాబాద్ - బెంగళూర్ మధ్య ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. బుందేల్ ఖండ్‌కు అర్హతలు లేకున్నా... అధికారం చేతిలో ఉందనే డిఫెన్స్ కారిడార్‌ను కేంద్రం ఇచ్చిందని మండిపడ్డారు. మౌలిక వసతులు లేకుండా డిఫెన్స్ కారిడార్ ఇవ్వగానే పెట్టుబడులు తరలిరావన్నారు. ప్రగతిశీల రాష్ట్రం అయిన తెలంగాణ‌ను కేంద్రమే ప్రోత్సహించాలని మంత్రి అన్నారు.


సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానిక జహీరాబాద్ వారికి పరిశ్రమ యజమాన్యం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 12600 ఎకరాలు భూమి నిమ్జ్‌కు కేటాయిస్తే ఇప్పటికి 3500 ఎకరాలే సేకరించినట్లు చెప్పారు. భూమి కోల్పోయిన రైతులకు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని, భూమి కోల్పోతున్న రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు.  ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, వెమ్ టెక్నాలజీ సీఎండీ వెంకటరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-22T18:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising