ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటి వెలుగు-2కు సన్నద్ధం

ABN, First Publish Date - 2022-12-07T00:29:16+05:30

కంటివెలుగు రెండో విడత జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనవరి 18 నుంచి ప్రారంభం

ప్రణాళికలు రూపొందించండి

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి టౌన్‌/మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 6 : కంటివెలుగు రెండో విడత జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. కంటి వెలుగు-2 అమలు, ప్రణాళికపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో మంగళవారం ఆయన జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రభావవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్‌ వార్డులవారీగా శిబిరాల షెడ్యూల్‌ను పంచాయతీ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలని సూచించారు. జనాభాకు అనుగుణంగా పరీక్షా బృందాలను సన్నద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ టీంలో ఒక డాక్టర్‌, అప్తొమెట్రిస్ట్‌, ఆశాలు, ఏఎన్‌ఎంలు, డాటాఎంట్రీ అపరేటర్లు, సీహెచ్‌వోలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పరీక్షల అనంతరం రీడింగ్‌ కళ్లద్దాలు అదే రోజు, దూరపు చూపు కళ్లద్దాలు 15 రోజుల్లో అందించాలని తెలిపారు. జిల్లాలో అప్తమాలజిస్టుల నియామకాలను త్వరగా పూర్తిచేసి జాబితా అందజేస్తే సరోజీనిదేవి, ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రుల్లో శిక్షణ ఇప్పిస్తామని స్పష్టం చేశారు.

సంగారెడ్డి జిల్లా నుంచి కలెక్టర్‌ ఎ.శరత్‌ మాట్లాడుతూ జిల్లాలో 17,11,678 మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు 69 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రూరల్‌ ఏరియాల్లో 41, అర్బన్‌ ప్రాంతాల్లో 16, జీహెచ్‌ఎంసీ పరిధిలో 6, బఫర్‌ జోన్‌లో 6 టీములను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 40 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో ఐదుగురు రెగ్యులర్‌ ఆప్తోమెట్రి్‌స్టలు ఉండగా మరో 15 మందిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించామని పేర్కొన్నారు. సీహెచ్‌సీలలోని వైద్యాధికారులు, ఆయుష్‌ వైద్యులు, రాష్ట్రీయ బాలస్వస్త్‌ కార్యక్రమం వైద్యులు కలిపి 52 మంది వైద్యులు, 270 మంది ఏఎన్‌ఎంలు, 560 మంది ఆశాకార్యకర్తలు అందుబాటులో ఉన్నారని తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీపీవో సురేశ్‌మోహన్‌, డీఎంహెచ్‌వో గాయత్రీదేవీ, జడ్పీ సీఈవో ఏల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జిల్లా వైద్యాధికారి చందు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising