ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మన ఊరు- మన బడి’ని జయప్రదం చేయాలి

ABN, First Publish Date - 2022-12-10T00:04:19+05:30

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్‌ జిల్లా ప్రాజెక్టు ఏఎ్‌సవో శశిధర్‌ పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న మెదక్‌ జిల్లా ప్రాజెక్టు ఏఎ్‌సవో శశిధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిల్‌పచెడ్‌, డిసెంబరు 9: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్‌ జిల్లా ప్రాజెక్టు ఏఎ్‌సవో శశిధర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన పనుల ప్రగతిని తెలుసుకునేందుకు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు శశిధర్‌, ఎంఈవో బుచ్చానాయక్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరు కొనసాగింపుతో పాటు విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను మెరుగునకు, మౌళిక వసతుల ఏర్పాటు కోసం రూపొందించిన ఈ పథకాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల చివరి వరకు ప్రతీ పాఠశాలలో 100 శాతం పనులు పూర్తిచేయాలని, ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారి విఠల్‌, ఆయా గ్రామాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising