ఆటో ఢీకొని వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-10-18T04:34:58+05:30
రోడ్డు పక్కన కూర్చున వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది.
నర్సాపూర్, అక్టోబరు 17: రోడ్డు పక్కన కూర్చున వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు కథనం ప్రకారం... గుర్జాతండాకు చెందిన బిచ్యనాయక్(35) సోమవారం ఉదయం బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు పక్కన కూర్చున్నాడు. అదే సమయంలో తిర్మలాపూర్ నుంచి వస్తున్న ఆటో అతివేగంగా వచ్చి కూర్చన్న బిచ్చనాయక్‌ను ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన బిచ్యనాయక్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. దీంతో మృతుడి తండ్రి రూప్‌సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-10-18T04:34:58+05:30 IST