ఐఎంఎఫ్‌ఎల్ డిపో ఎదుట స్థానికుల నిరసన
ABN, First Publish Date - 2022-10-18T05:03:36+05:30
మండలంలోని ఐఎంఎ్‌ఫఎల్ డిపో ఎదుట చిన్నఘనపూర్ గ్రామస్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
కొల్చారం, అక్టోబరు 17: మండలంలోని ఐఎంఎ్‌ఫఎల్ డిపో ఎదుట చిన్నఘనపూర్ గ్రామస్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక యువకులకు ఐఎంఎ్‌ఫఎల్ డిపోలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా హమాలీ పోస్ట్‌ను లక్షల్లో వేలం వేయడంతో డబ్బులు ఉన్న వారు కొనుగోలు చేస్తున్నారని, డబ్బు లేని వారు ఉద్యోగం లేక కుటుంబ పోషణ భారంగా మారి తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్థులు హెచ్చరించారు.
Updated Date - 2022-10-18T05:03:36+05:30 IST