మునిసిపాలిటీని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుదాం
ABN, First Publish Date - 2022-10-18T05:16:40+05:30
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుదామని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు.
గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి
గజ్వేల్, అక్టోబరు 17: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుదామని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, కమిషనర్ పాతూరి గణే్‌షరెడ్డి, కౌన్సిలర్ బొగ్గుల చందుతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో నిర్మించాల్సి ఉన్న సీసీరోడ్ల అంచనాను తయారు చేయాలని మునిసిపల్ ఏఈ శ్రీధర్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం వార్డు పరిధిలో పలు సమస్యలను గుర్తించిన ఆయన వెంటనే పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. యూజీడీ పనులు పూర్తవుతున్నందున సీసీరోడ్ల పనులు, అవసరమైన చోట డ్రైనేజీల నిర్మాణం చేపడుతామని ముత్యంరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-10-18T05:16:40+05:30 IST