స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వీడి విమర్శలా?
ABN, First Publish Date - 2022-08-05T04:56:02+05:30
కాంగ్రెస్ చలవతో ఎదిగిన రాజగోపాల్‌రెడ్డి తల్లిపాలు తాగి రొమ్మును గుద్దిన దుర్మార్గుడని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆది శ్రీనివాస్ విమర్శించారు.
రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ఫైర్
దిష్టిబొమ్మల దహనం
చేర్యాల, ఆగస్టు 4: కాంగ్రెస్ చలవతో ఎదిగిన రాజగోపాల్‌రెడ్డి తల్లిపాలు తాగి రొమ్మును గుద్దిన దుర్మార్గుడని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆది శ్రీనివాస్ విమర్శించారు. వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని వీడి అధినాయకత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. అనంతరం చేర్యాలలోని అంగడిబజారు క్రాస్‌రోడ్డు వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మంచాల చిరంజీవులు, కూరపాటి మదుసూధన్, కాటం శ్రీనివాస్, వెలగల దుర్గయ్య, అయిత శ్రీనివాస్, భూమిగారి జనార్ధన్, గుస్క కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చిన్నకోడూరు: రాజగోపాల్‌రెడ్డి తన స్థాయిని మరచి మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసం మహేందర్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండలంలోని అల్లీపూర్ గ్రామంలో రాజగోపాల్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి కేవలం తన కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరుతున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పరశురాం, శంకర్, జయంత్, ప్రశాంత్, బాబు, అజయ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T04:56:02+05:30 IST