ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరి బాగుకోసమే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్‌

ABN, First Publish Date - 2022-10-07T04:43:23+05:30

దేశం బాగుండడం కోసమే సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

వర్గల్‌ విద్యాధరి క్షేత్రం వద్ద విలేకరులతో మాట్లాడుతున్న వంటేరు ప్రతా్‌పరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్గల్‌, అక్టోబరు 6: దేశం బాగుండడం కోసమే సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలోని విద్యా సరస్వతీ అమ్మవారి ఆలయంలో బీఆర్‌ఎస్‌ ప్రకటనకు గాను సీఎం కేసీఆర్‌పై అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు తెలంగాణలో ప్రజలకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్‌, జడ్పీటీసీ బాలుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వేలూరి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

హుస్నాబాద్‌: సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎ్‌సను ప్రకటించడం పట్ల బుధవారం హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, ఎంపీపీ మానస, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత పాల్గొన్నారు. 

దుబ్బాక/మిరుదొడ్డి: దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పడం ఖాయమని దుబ్బాక మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ వనితాభూంరెడ్డి, మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు అన్నారు. బుధవారం కేసీఆర్‌ భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌ ప్రకటన పట్ల దుబ్బాక, మిరుదొడ్డి మండల కేంద్రాల్లో వేరువేరుగా సంబురాలు నిర్వహించారు. 

చిన్నకోడూరు: చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో కేసీఆర్‌, హరీశ్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాఽధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

సిద్దిపేట అర్బన్‌: సిద్దిపేట అర్బన్‌ మండలంలోని రంగధాంపల్లి చౌరస్తా, ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ వంగ రేణుకాతిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ మెనార్టీ అధ్యక్షుడు అక్బర్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 

ములుగు: ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో ములుగు పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కుక్కల నరే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. 

వర్గల్‌: వర్గల్‌ మండలం కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. 

తొగుట: తొగుట మండలంలో అంబేడ్కర్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలవేసి, అనంతరం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

జగదేవ్‌పూర్‌: జగదేవ్‌పూర్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

నారాయణరావుపేట: నారాయణరావుపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఏర్పాటు పట్ల టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోనయ్యగారి ఎల్లయ్య ఆఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 

కొండపాక: కొండపాక మండలంలోని కుకునూరుపల్లి, దుద్దెడ రాజీవ్‌ రహదారిపై టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కుకునూరుపల్లిలో జరిగిన కార్యక్రమంలో పీఎన్‌ఆర్‌ చైర్మన్‌ పోల్కంపల్లి నరేందర్‌, ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ సద్గుణ రవీందర్‌ పాల్గొన్నారు. 

కొండపాక: భారత రాష్ట్ర సమితి కొత్త చరిత్ర సృష్టిస్తుందని ఎంపీటీసీల ఫోరం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవీ రవీందర్‌ అన్నారు. కొండపాక మండలం లకుడారంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుతూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం శుభ సూచకమన్నారు.

నంగునూరు: బీఆర్‌ఎస్‌ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల్లో  సంబరాలు చేసుకున్నారు.  

Updated Date - 2022-10-07T04:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising