ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ అభివృద్ధికి దిక్సూచి కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2022-08-10T06:14:25+05:30

స్వాతంత్ర్యానంతరం దేశ అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ దిక్సూచిలా ఉన్నదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న పాదయాత్రను మంగళవారం ఆయన సదాశివపేట మండలం ఆరూరులో ప్రారంభించారు.

సదాశివపేట మండలం ఆరూరు నుంచి పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాదయాత్రలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఆగస్టు 9: స్వాతంత్ర్యానంతరం దేశ అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ దిక్సూచిలా ఉన్నదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న పాదయాత్రను మంగళవారం ఆయన సదాశివపేట మండలం ఆరూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కృషి చేశాయన్నారు. దేశభక్తికి చిరునామాగా కాంగ్రెస్‌ ఉన్నదన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రె్‌సదని స్పష్టం చేశారు. ఇద్దరు ప్రధాన మంత్రులను కోల్పోయిన ఘటనలను దేశ ప్రజలు ఎప్పటికీ మరువరని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మహాత్మాగాంధీ, నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలాంటి నాయకులు అవసరమని పేర్కొన్నారు. తొలిరోజు 10 కిలోమీటర్లు నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు, కాంగ్రె్‌సవాదుల నుంచి వచ్చిన స్పందన సంతోషం కలిగించిందని అన్నారు. పాదయాత్రలో నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, ఆయా గ్రామాల కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు టి.నిర్మలా జగ్గారెడ్డి, కూతురు జయారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising