ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేర్యాల ప్రాంతం తెలంగాణలో లేదా?

ABN, First Publish Date - 2022-03-23T04:57:30+05:30

చేర్యాల ప్రాంత ప్రజలు ఏం నేరం చేశారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చేర్యాల తెలంగాణలో లేదా అని జేఏసీ నాయకులు ప్రశ్నించారు.

చేర్యాలలో ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై వివక్ష తగదు 

బైక్‌ర్యాలీలో జేఏసీ నాయకులు

చేర్యాల/మద్దూరు, మార్చి 22 : చేర్యాల ప్రాంత ప్రజలు ఏం నేరం చేశారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చేర్యాల తెలంగాణలో లేదా అని జేఏసీ నాయకులు ప్రశ్నించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం చేపట్టిన బైక్‌ర్యాలీ భైరాన్‌పల్లి నుంచి కొమురవెల్లి మండలాల మీదుగా కలెక్టరేట్‌కు చేరింది. ఈ సందర్భంగా చేర్యాల పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జేఏసీ చైర్మన్‌ భైరవభట్ల చక్రధర్‌, నాయకులు బండి శ్రీనివాస్‌, అందె బీరయ్య, అందె అశోక్‌ మాట్లాడారు. చేర్యాల ప్రాంతం తెలంగాణలో లేదన్నట్లుగా సీఎం కేసీఆర్‌ చిన్నచూపు వహిస్తుండటం తగదన్నారు. డివిజన్‌ సాధనకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవ వహించని యెడల అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గద్దల మహేందర్‌, నంగి మైసయ్య, ఈరు భూమయ్య, సుతారి రమేష్‌, ఆరుగొండ మల్లయ్య, బందిగ రాకేశ్‌కృష్ణ, రామగల్ల నరేశ్‌, పుల్లని వేణు పాల్గొన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకై దూళిమిట్ట మండలం బైరాన్‌పల్లిలోని చరిత్రాత్మకమైన బురుజు వద్ద నుంచి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీని సర్పంచ్‌ బండి శ్రీనివాస్‌ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమరవీరులకు నివాళులర్పించారు. భైరాన్‌పల్లిలో ప్రారంభమైన ర్యాలీ దూళిమిట్ట మండల కేంద్రం లింగాపూర్‌, గాగిళ్లాపూర్‌ మద్దూరు మీదుగా చేర్యాల మండలంలోని ముస్త్యాల నుంచి చేర్యాలకు చేరుకున్నది. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బయలుదేరింది. 

Updated Date - 2022-03-23T04:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising