ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి చేసుకోవడమే నేరమా?

ABN, First Publish Date - 2022-12-16T00:01:24+05:30

‘పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవడమే మేం చేసిన నేరమా’ అని గురువారం అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలోని గౌరవెల్లి ప్రాజెక్టు దీక్షాశిబిరంలో కొందరు మహిళలు పిల్లాపాపలతో కలిసి ఆందోళన చేపట్టారు

గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట దీక్ష శిబిరం వద్ద ఆందోళన చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యాకేజీ జాబితా నుంచి మా పేర్లు ఎందుకు తొలగించారు

న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తాం

గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద మహిళల ఆందోళన

స్పందించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరిక

అక్కన్నపేట, డిసెంబరు 15: ‘పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవడమే మేం చేసిన నేరమా’ అని గురువారం అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలోని గౌరవెల్లి ప్రాజెక్టు దీక్షాశిబిరంలో కొందరు మహిళలు పిల్లాపాపలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ జాబితా నుంచి దాదాపు 100 మంది యువతుల పేర్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని 2021లో 485 మందితో కూడిన జాబితాను అధికారులు తయారు చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. జాబితాలో పేరు ఎలాగో ఉంది కదా అని 18 ఏళ్లు నిండిన యువతులకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అయితే పెళ్లిళ్లు అయిన 85 నుంచి 100 మంది యువతుల పేర్లను అధికారులు ప్యాకేజీ జాబితా నుంచి తొలగించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ డబ్బు వచ్చాక కట్నకానుకల్లో రావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామని తమ తల్లిదండ్రులు హామీ ఇచ్చారని, ఇప్పుడు తమ పేర్లను తొలగిస్తే ఎలా అని సదరు మహిళలు ప్రశ్నిస్తున్నారు. అందరికీ చెక్కులు పంపిణీ చేస్తామని అదనపు కలెక్టర్‌ హామీ ఇచ్చినా, వెరిఫికేషన్‌ పేరుతో తొలగించాల్సిన అవసరం ఏముందని వారు ఆవేదన చెందారు. న్యాయంగా తమకు రావాల్సిన ప్యాకేజీ డబ్బు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. అధికారులు స్పందించకుంటే హుస్నాబాద్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట పురుగులమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడతామని వారు హెచ్చరించారు.

Updated Date - 2022-12-16T00:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising