ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీపు చోరీ కేసులో అంతర్‌జిల్లా దొంగ అరెస్టు

ABN, First Publish Date - 2022-10-08T05:08:00+05:30

రామాయంపేటలో జరిగిన జీపు చోరీ కేసులో పోలీసులు 48 గంటల్లో అంతర్‌జిల్లా దొంగను వాహనంతో సహా పట్టుకున్నారు

నిందితుడిని చూపుతున్న సీఐ చంద్రశేఖర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిందితుడిపై మూడు జిల్లాల్లో 25 కేసులు 

రామాయంపేట, అక్టోబరు 7: రామాయంపేటలో జరిగిన జీపు చోరీ కేసులో పోలీసులు 48 గంటల్లో అంతర్‌జిల్లా దొంగను వాహనంతో సహా పట్టుకున్నారు. శుక్రవారం సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్‌  వివరాలను వెల్లడించారు. ఈ నెల 3న పట్టణానికి చెందిన ఎండీ రజాక్‌ జీపు(తూఫాన్‌)ను స్థానిక ప్రభుత్వ జూనియర్‌  కళాశాల వద్ద పార్కింగ్‌ చేశాడు. దసరా పండుగకు వేరే ప్రాంతానికి వెళ్లి రెండు రోజుల తర్వాత వచ్చి చూడగా జీపు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుడి  వివరాలను సేకరించారు. ఎస్‌ఐ తన సిబ్బందితో వెళ్లి నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సేవాలాల్‌ తండాకు చెందిన దుర్గాప్రసాద్‌ అలియాస్‌ దుర్గ అలియాస్‌ వంశీ అలియాస్‌ దీపక్‌ను పట్టుకున్నారు. అలాగే తండాలోని ఓ గుడిసెలో దాచి ఉంచిన జీపును సైతం స్వాధీనపర్చుకున్నట్టు తెలిపారు. సదరు నిందితుడిపై నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇప్పటికే 25 కేసులు నమోదు అయినట్లు సీఐ, ఎస్‌ఐలు తెలిపారు. అతడిని రిమాండ్‌ పంపినట్లు వారు పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-08T05:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising