ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూప్రాన్‌ మార్కెట్‌యార్డు తనిఖీ

ABN, First Publish Date - 2022-12-16T00:05:02+05:30

తూప్రాన్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డును గురువారం అదనపు కలెక్టర్‌ రమేశ్‌ సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు.

తూప్రాన్‌ మార్కెట్‌యార్డును పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రమేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌ మార్కెట్‌పై ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

నివేదిక అందజేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

సందర్శించిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌

తూప్రాన్‌, డిసెంబరు 15: తూప్రాన్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డును గురువారం అదనపు కలెక్టర్‌ రమేశ్‌ సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ‘ఐదు సంవత్సరాలుగా అసంపూర్తిగానే!’ అనే కథనం బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన విషయం విధితమే. ఈ కథనాన్ని చూసిన మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ నుంచి అదనపు కలెక్టర్‌తో మాట్లాడి సమగ్ర రిపోర్టు అందజేయాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన మార్కెట్‌ యార్డును పరిశీలించారు. ఈ నెలాఖరు వరకు పనులను పూర్తి చేసి ప్రారంభించాలని మార్కెటింగ్‌శాఖ డీఈఈ మాధవరెడ్డిని ఆదేశించారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ లక్ష్మణ్‌ పెండింగ్‌ బిల్లుల విషయాన్ని అదనపు కలెక్టర్‌ రమేశ్‌కు వివరించగా కలెక్టర్‌ హరీశ్‌ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఆయన వెంట మార్కెటింగ్‌శాఖ డీఈఈ మాధవరెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి రియాజ్‌ అహ్మద్‌, మార్కెటింగ్‌ కార్యదర్శి జాన్‌వెస్లీ ఉన్నారు.

Updated Date - 2022-12-16T00:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising