ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తే అరెస్టులా?

ABN, First Publish Date - 2022-08-05T04:58:14+05:30

మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనాన్ని అందిస్తున్న విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్దామనే ఆలోచనతో వెళ్తుంటే అరెస్టు చేస్తారా అని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 4: మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనాన్ని అందిస్తున్న విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్దామనే ఆలోచనతో వెళ్తుంటే అరెస్టు చేస్తారా అని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ మండిపడ్డారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి హరీ్‌శరావు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయగా.. సమస్యను వివరించేందుకు వెళ్తున్న తనను అక్రమ అరెస్టు చేయడం దారుణమన్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి సమస్య ఏమిటో తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై వినతిపత్రాన్ని అందించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకోవడం సబబు కాదన్నారు. రెసిడెన్షియల్‌లో సమస్యలను పరిష్కరించకుంటే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామన్నారు. ఆయనవెంట యూత్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ అధ్యక్షుడు వహాబ్‌, యూత్‌ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సలీం, నాయకులు మున్నా గాయసుద్దీన్‌, రషీద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-05T04:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising