ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2022-07-01T05:24:35+05:30

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి 120 మైక్రాన్‌లలోపు ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి


సిద్దిపేట టౌన్‌, జూన్‌ 30: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి 120 మైక్రాన్‌లలోపు ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో వ్యాపారులకు బట్ట సంచులపై కమిషనర్‌ రవీందర్‌రెడ్డి అవగాహన కల్పించారు. పట్టణంలోని వ్యాపారులు సహకరించాలని కోరారు. మార్కెట్‌కు టిఫిన్‌బాక్సులు, బట్ట సంచులు తీసుకెళ్లాలని సూచించారు. దుకాణాల వద్ద ప్లాస్టిక్‌ నిషేధమంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, టిఫిన్‌ బాక్సులను వెంట తీసుకుని వచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 


చేర్యాలలో అవగాహన


చేర్యాల, జూన్‌ 30: 120మైక్రాన్ల మందం కలిగిన, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువులు విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని చేర్యాల మునిసిపల్‌ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ హెచ్చరించారు. ప్లాస్లిక్‌ కవర్ల నిషేధంపై గురువారం చేర్యాల రైతుబజారులో కూరగాయల వ్యాపారులతో పాటు పట్టణంలోని దుకాణదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి రూ.500-5వేల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్‌, మంగోలు చంటి, ముస్త్యాల తార,  చెవిటి లింగం, యాట కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.


 


Updated Date - 2022-07-01T05:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising