ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd: కేపీహెచ్‌బీలో వ్యక్తి అదృశ్యం.. జిన్నారంలో murder..

ABN, First Publish Date - 2022-07-03T16:10:27+05:30

హైదరాబాద్: కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): నగరంలోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. జిన్నారంలో హతుడిగా ప్రత్యక్షమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ 1లో  నారాయణ రెడ్డి (25) (Narayana reddy) అనే వ్యక్తి  ఫ్రెండ్స్‌తో కలిసి నివసిస్తున్నాడు. గత నెల 30వ తేదీన అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు (Missing case)గా నమోదు చేసి... దర్యాప్తు చేపట్టారు. ఇవాళ జిన్నారంలో హత్య చేసి తగులబెట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఏడాది క్రితం నారాయణ రెడ్డి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదు. దీంతో యువతిని బలవంతంగా తీసుకువెళ్లి ఇంట్లో నిర్బంధించారు. కాగా గత నెల నుంచి యువతికి, నారాయణ రెడ్డి మధ్య సంబంధం పెరిగింది. దీంతో యువతి బంధువు శ్రీనివాస్ రెడ్డి, నారాయణ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. యువతి తల్లిదండ్రులు, బంధువులే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-07-03T16:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising