ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిరమల్‌ ఫార్మా పరిశ్రమలో హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘం గెలుపు

ABN, First Publish Date - 2022-05-26T05:42:03+05:30

కోహీర్‌ మండలం దిగ్వాల్‌ గ్రామంలో గల పిరమల్‌ ఫార్మా పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములుపై హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివా్‌సరెడ్డి 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘం కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జహీరాబాద్‌, మే 25: కోహీర్‌ మండలం దిగ్వాల్‌ గ్రామంలో గల పిరమల్‌ ఫార్మా పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములుపై హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివా్‌సరెడ్డి 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పరిశ్రమలో పర్మినెంట్‌ కార్మికులు మొత్తం 158 మంది కార్మికులు ఉండగా బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో మొత్తం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో సీఐటీయూకు 74 ఓట్లు రాగా, హెచ్‌ఎంఎ్‌సకు 84 ఓట్లు వచ్చాయి. దీంతో సీఐటీయూపై హెచ్‌ఎంఎస్‌ 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఈ సందర్భంగా కార్మికులు కార్మాగారం గేటు ముందు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు. ఆరేళ్ల తర్వాత పిరమల్‌ ఫార్మా పరిశ్రమలో హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘం విజయం సాధించడం పట్ల కార్మికులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా  ఎన్నికల్లో గెలుపొందిన హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నిరంతరం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాననినని శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మినిమం వేజ్‌బోర్డ్‌ మాజీ చైర్మన్‌ సదానందం, కార్మికులు కనకయ్య, రంగయ్య, చంద్రశేఖర్‌, షఫీ, అల్లబక్షి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-26T05:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising