ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ అంటే ఝూటా మాటల పార్టీ

ABN, First Publish Date - 2022-01-17T05:03:56+05:30

బీజేపీ ఝూటా పార్టీ అని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు పటెండ్ల రాజారాం, మండల నాయకుడు బోయిని ఎల్లం తమ అనుచరులతో కలిసి శనివారం టీఆర్‌ఎ్‌సలో చేరగా మంత్రి వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులతో మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియాలో అబద్దాల ప్రచారం ఎక్కువ కాలం సాగదు

ఉద్యోగాలు ఊడగొట్టుడు.. నిరుద్యోగుల పొట్టగొట్టుడే బీజేపీ నినాదం

ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


నారాయణరావుపేట, జనవరి 16: బీజేపీ ఝూటా పార్టీ అని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు పటెండ్ల రాజారాం, మండల నాయకుడు బోయిని ఎల్లం తమ అనుచరులతో కలిసి శనివారం టీఆర్‌ఎ్‌సలో చేరగా మంత్రి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నిజస్వరూపం బయటపడుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను సంక్షోభంలో పడేస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావాలని ప్రయత్నించారని, ఎరువుల ధరలను పెంచి రైతులపై భారం మోపారని విమర్శించారు. సోషల్‌ మీడియాలో బీజేపీ చేసే అబద్దాల ప్రచారం ఎక్కువ కాలం సాగదని హెచ్చరించారు. ఉద్యోగాలు ఊడగొట్టుడు, నిరుద్యోగుల పొట్టగొట్టుడే బీజేపీ నినాదమని ఎద్దేవా చేశారు. కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలు ఇవ్వాలన్నా.. ఉపాధి కల్పించాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, సమయానికి ఎరువులు విత్తనాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ ఇంటి పార్టీ అని స్పష్టం చేశారు. టీఆర్‌ఎ్‌సలో చేరినవారిలో గుర్రాలగొంది గ్రామానికి చెందిన పిట్ల నరేష్‌, ముంజ సురేశ్‌, సురగోని మహేశ్‌, జంగిటి మహేశ్‌, రాజు, అనిల్‌, కనకయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంజయనేయులు, ఎంపీటీసీ హరీశ్‌, మాజీ సర్పంచ్‌ కనకయ్య, సత్తయ్య, మాజీ ఎంపీటీసీ మల్లేశంగౌడ్‌, ముత్యం, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పిట్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising