ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddipetకు రింగ్ రోడ్ మణిహారం: మంత్రి Harish Rao

ABN, First Publish Date - 2022-07-01T18:05:39+05:30

రూ. 160 కోట్లతో సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట (Siddipet) జిల్లా: చిన్న కోడూరు మండల కేంద్రంలో రూ. 160 కోట్లతో సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్ పనులకు మంత్రి హరీష్ రావు (Harish Rao) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటకు రింగ్ రోడ్ మణిహారం లాంటిందన్నారు. సిద్దిపేట పట్టణం చుట్టూ 7 మండలాలను కలుపుతూ 88 కిలోమీటర్ల మేరకు రూ. 160 కోట్లతో రింగ్ రోడ్ వేస్తున్నామన్నారు. రింగ్ రోడ్ వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుందని, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు.


ఎంత కష్టం ఉన్న సీఎం కేసీఆర్ (CM KCR) రైతుల కోసం రైతు బంధు డబ్బులు వేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. భారత దేశంలో అన్ని ప్రభుత్వాలు రైతుల నుంచి శిస్తు వసూలు చేస్తే... రైతులకు పన్నుకట్టింది కేసీఆర్ మాత్రమే అన్నారు. నీటి తీరువాను బీజేపీ, కాంగ్రెస్‌లు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెట్టమని రైతుల మెడకు ఊరి తాడు పెడుతోందన్నారు. ఏపీలో బావుల వద్ద మీటర్లు పెడతామని ఆ ప్రభుత్వం 4 శాతం ఎఫ్ఆర్‌బీఎం (frbm) నిధులు తెచ్చుకుందని చెప్పారు. తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్ రూ. 25 వేల కోట్లు వద్దనుకున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనలేదు కానీ.. ప్రజలకు నూకలు తినిపించమని అవమాన పరిచిందన్నారు. తెలంగాణలో రైతుబంధు డబ్బులు టింగ్ టింగ్ అని పడుతుంటే రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతోందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-01T18:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising