ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి Harish Rao

ABN, First Publish Date - 2022-06-26T18:48:37+05:30

బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ పొందిన విద్యార్థులకు హరీష్ రావు పుస్తకాలు పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Siddipet జిల్లా: పట్టణంలో బీసీ స్టడీ సర్కిల్‌ (BC Study Circle‌)లో ఉచిత  కానిస్టేబుల్ (Conistable) శిక్షణ పొందిన విద్యార్థులకు (Students) మంత్రి హరీష్ రావు (Harish Rao) పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ విశ్వాసంతో చదివి పేరు తెచ్చుకుని, మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటున్నానన్నారు. బీసీ స్టడీ సర్కిల్ వచ్చాక ఇది 4వ బ్యాచ్ అని, 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో 95 వేల ఉద్యోగాలు ఇస్తామని, అన్ని నోటిఫికేషన్‌లు ఒక్కసారిగా ఇస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి దశల వారిగా ఇస్తామన్నారు. ఈ ఏడాది ఉద్యోగాల సంవత్సరంగా మారనుందన్నారు. వచ్చే ఏడాది ఎంత మంది రిటైర్డ్ అయితే మళ్ళీ అంత మందికి జాబ్ నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కేంద్రం పరిధిలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మూడేళ్ల నుంచి కేంద్రం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు కంప్యూటర్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు. విద్యార్థులు మొబైల్, సినిమాలు, టీవీలు వదిలి చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులు కోరికను, మీ గోల్‌కు చేరాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

Updated Date - 2022-06-26T18:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising