ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంచార జాతులకు పెద్దపీట

ABN, First Publish Date - 2022-08-05T04:55:07+05:30

: సంచార జాతులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సంచార జాతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

బుడబుక్కల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలోనే తొలి బుడ బుక్కల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన 

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 4: సంచార జాతులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సంచార జాతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో బుడబుక్కల సంఘం భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జాతి గర్వించేలా మొదటి బుడ బుక్కల భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. బుడబుక్కల కులస్థుల్లో అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని హామీనిచ్చారు. స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం 21 వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 28వ వార్డులో మహిళా భవనం, రీడింగ్‌ రూమ్‌, టీటీడీ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకూ బీటీ రోడ్డు, అలాగే సీసీ రోడ్లు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టీల్‌ బ్యాంకును ప్రారంభించారు. అసంపూర్తి యూజీడీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. 7వ వార్డులో ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఇమాంబాద్‌కు చెందిన బీజేపీ నాయకులు సత్యం, భిక్షపతి, బీజేవైఎం, కిసాన్‌ మోర్చా నాయకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 

గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ

సిద్దిపేట అర్బన్‌: ఎన్సాన్‌పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను గురువారం మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో విద్యా బోధన జరుగుతున్న తీరును, విద్యార్థులకు అందజేస్తున్న భోజనంపై ఆరా తీశారు. గురుకుల పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉన్నాయని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలను సందర్శిస్తూ పరిశుభ్రంగా ఉంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయనవెంట సర్పంచ్‌ రవీందర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ ఎల్లం, ఎంపీటీసీ స్రవంతిప్రశాంత్‌, ప్రిన్సిపాల్‌ లలిత ఉన్నారు.

Updated Date - 2022-08-05T04:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising