ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం: జడ్పీటీసీ

ABN, First Publish Date - 2022-10-12T04:33:45+05:30

కులవృత్తులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వర్గల్‌ జడ్పీటీసీ బాలుయాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్గల్‌, అక్టోబరు 11: కులవృత్తులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వర్గల్‌ జడ్పీటీసీ బాలుయాదవ్‌ అన్నారు. మంగళవారం నాచారం నాచగిరి లక్ష్మీనృసింహాస్వామి క్షేత్రంలోని హల్డీ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలి మాట్లాడారు. చెరువులు, కుంటల్లో గంగపుత్రులతో పాటు ముదిరాజ్‌లకు ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు జాలిగామ వెంకటేశ్‌ గౌడ్‌, నాచారం మాజీ సర్పంచ్‌ యాదగిరిగౌడ్‌, నాయకులు మురళీగౌడ్‌, కుమార్‌, అంజనేయులు పాల్గొన్నారు. 

చేపల పెంపకంతో ముదిరాజ్‌ల ఆర్థికాభివృద్ధి

కొండపాక, అక్టోబరు 11: చేపల పెంపకంతో ముదిరాజ్‌లు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవి రవీందర్‌ అన్నారు. మంగళవారం కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి, లకుడారం గ్రామల్లో ముదిరాజ్‌ కులస్తులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువులో వదిలి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్‌ మల్లమారి రవీందర్‌, లకుడారం సర్పంచ్‌ కందూరి కనకవ్వ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-12T04:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising