మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN, First Publish Date - 2022-03-06T05:08:25+05:30
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి తెలిపారు.
హత్నూర, మార్చి 5: రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి తెలిపారు. శనివారం హత్నూర మండల సమాక్య ఆధ్వర్యంలో మహిళా విజయోత్సవసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. స్త్రీనిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.12,400కోట్ల రుణాలను మహిళా సంఘాల ద్వారా 27లక్షల మంది మహిళలకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. అనంతరం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మహిళలను సన్మానించారు. హత్నూర మండల సమాఖ్య ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కాగా మహిళా సంఘం భవనంలో ఫర్నిచర్ కొరత ఉందని తెలుపగా.. తక్షణ సహాయంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రూ.25వేలు, ఎంపీపీ నర్సింహులు రూ.25వేలు, జడ్పీటీసీ ఆంజనేయులు రూ.25వేలను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, సర్పంచ్ వీరస్వామిగౌడ్, మాజీ జడ్పీటీసీ ఆశయ్య, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:08:25+05:30 IST