ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం వివక్ష చూపడం తగదు: వీఆర్‌ఏలు

ABN, First Publish Date - 2022-08-05T04:57:26+05:30

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ పట్ల వివక్ష వహిస్తుండడం తగదని వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

11వ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె

చేర్యాల/కొండపాక/హుస్నాబాద్‌/అక్కన్నపేట/చిన్నకోడూరు/నంగునూరు/ములుగు/జగదేవపూర్‌/కోహెడ, ఆగస్టు 4: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ పట్ల వివక్ష వహిస్తుండడం తగదని వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం 11వ రోజుకు చేరింది. ఆయా పట్టణాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలను అందజేసి నిరసన తెలిపారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని యూనియన్‌ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వలబోజు కరుణాకర్‌ అన్నారు. చేర్యాల తహసీల్దార్‌ ఆరీఫాబేగం, ధూల్మిట్ట తహసీల్దారు అశోక్‌ వీఆర్‌ఏలకు సంఘీభావం తెలిపారు. కొండపాకలో వీఆర్‌ఏల సంఘం నాయకులు కృష్ణమూర్తి, బాలకృషన్‌ పాల్గొన్నారు. హుస్నాబాద్‌లో వీఆర్‌ఏల సంఘం డివిజన్‌ గౌరవ అధ్యక్షుడు అయిలేని మల్లిఖార్జున్‌రెడ్డి, వీఆర్‌ఏ జేఏసీ నాయకులు నీరటి కుమారస్వామి, భవాని, బోజు ప్రసాద్‌, రాజయ్య, తిరుమల, బీఎస్పీ నాయకులు మారపల్లి సుధాకర్‌, బీజేవైఎం నాయకులు కర్ణకంటి నరేష్‌, శరత్‌ పాల్గొన్నారు. అక్కన్నపేటలో వీఆర్‌ఏల సంఘం మండలాధ్యక్షుడు గిరిమల్ల రాజు, ప్రధాన కార్యదర్శి వోద్దమల్ల తిరుపతిరాజు, ఉపాధ్యక్షులు వాసాల బొందయ్య, కోశాధికారి వాసాల కృష్ణ పాల్గొన్నారు. చిన్నకోడూరులో వీఆర్‌ఏల జేఏసీ జిల్లా కో చైర్మన్‌ ఆరుట్ల బాలయ్య, వీఆర్‌ఏల సంఘం మండలాధ్యక్షుడు శ్రీశైలం పాల్గొన్నారు. నంగునూరులో వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు పంగ మల్లేశం, వైస్‌ ప్రెసిడెంట్‌ నలమాల వెంకటేశ్‌, శ్రీరాముల మల్లేశం, పిల్లి నరేశ్‌, యాదగిరి, గట్టు అజయ్‌, ఎల్లయ్య, శ్యామల, కనకవ్వ, శ్రీనివాస్‌, కనకయ్య, సంపత్‌ పాల్గొన్నారు. ములుగులో వీఆర్‌ఏలకు బీజేపీ మండలాధ్యక్షుడు పల్లె రమేష్‌యాదవ్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రాములు, మనోహర్‌యాదవ్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. జగదేవ్‌పూర్‌లో వీఆర్‌ఏల సంఘం మండలాధ్యక్షడుఉ మన్నె శ్రీనివాస్‌, వీఆర్‌ఏలు సత్యనారాయణ, నర్సింలు, శ్రీను, సత్తయ్య, భాగ్య పాల్గొన్నారు. కోహెడలో వీఆర్‌ఏల సంఘం మండలాధ్యక్షుడు బండ మహేందర్‌,  ఉపాధ్యక్షులు పెండల ప్రశాంత్‌, ప్రధాన కార్యదర్శి తలారి శ్రీకాంత్‌, గౌరవ అధ్యక్షుడు కర్కాల శంకర్‌, మమత, రమేష్‌, కుమార్‌, శ్రీనివాస్‌, సంపత్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T04:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising