ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫార్మా కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN, First Publish Date - 2022-05-29T05:05:01+05:30

ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

కర్కపట్ల బయోటెక్‌ పార్క్‌ ఫేజ్‌-3లో రెట్‌ హెల్త్‌ కేర్‌ కంపెనీని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెట్‌ హెల్త్‌ కేర్‌ కంపెనీని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

జగదేవ్‌పూర్‌, మే 28: ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల పరిధిలోని కర్కపట్ల బయోటెక్‌ పార్క్‌ ఫేజ్‌-3 లో రెట్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మాలేషన్‌ యూనిట్‌ను కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. కొవిడ్‌ తర్వాత ఫార్మా కంపెనీలకు అధిక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. కంపెనీ టెక్నికల్‌ డైరెక్టర్‌ సీఈవో డాక్టర్‌ రఘువీర్‌ మాట్లాడుతూ రెట్‌ హెల్త్‌ కేర్‌ యూనిట్‌ను రూ.15.96 కోట్లతో నెలకొల్పామని, ఫ్యాక్టరీలో టాబ్లెట్స్‌, క్యాప్సుల్స్‌, పౌడర్‌, లోషన్‌, జెల్‌, సోఫ్‌, ఆర్గానిక్‌, హెయిర్‌ ఆయిల్‌, షాంపూ, సొల్యూషన్‌ వంటివి తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, మర్కుక్‌ ఎంపీపీ పాండుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మర్కుక్‌ మండలాధ్యక్షుడు కర్ణాకర్‌రెడ్డి, సర్పంచ్‌ గాజె నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T05:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising