ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొల్లకురుమల సమస్యలను పరిష్కరించాలి : రవీందర్‌

ABN, First Publish Date - 2022-05-24T05:07:32+05:30

గొల్లకురుమలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, మే 23: గొల్లకురుమలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌ అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆలేటి యాదగిరి అధ్యక్షతన జరిగిన జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. మొదటివిడత గొర్రెలు ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా పంపిణీ చేయకపోగా, రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టకపోవడం తగదన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.5 వేల పెన్షన్‌ అందించాలని, ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, సొసైటీకి కమ్యూనిటీ భవనం నిర్మించి యువకులకు రూ.30 లక్షలతో గోట్‌ఫారం ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు మల్లన్న ఆలయ వీధుల గుండా డోలు చప్పుళ్ల నడుమ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి బాలరాజు, ఆలేటి రజిత, బియ్య సిద్ధులు, సత్తయ్య, మీస మల్లయ్య, తిరుపతి, ఇరుమల్ల ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising