ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు సంకెళ్లు

ABN, First Publish Date - 2022-07-01T05:40:18+05:30

గత నెల 14వ తేదీన హుస్నాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు, భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట, లాఠీచార్జిలో 17 మంది భూనిర్వాసితులపై కేసులు నమోదు చేశారు. ఇందులో బద్దం శంకర్‌రెడ్డి, అంగెటి తిరుపతిరెడ్డి, రాగి శ్రీను, భూక్య సక్రూలను అరెస్ట్‌ చేసి కరీంనగర్‌ జైలుకు తరలించారు. గురువారం పోలీసులు వారి చేతులకు సంకెళ్లు వేసి హుస్నాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేం సంఘ విద్రోహులమా ? 

నిర్వాసిత కుటుంబసభ్యుల ఆవేదన


హుస్నాబాద్‌, జూన్‌ 30 : గత నెల 14వ తేదీన హుస్నాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు, భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట, లాఠీచార్జిలో 17 మంది భూనిర్వాసితులపై కేసులు నమోదు చేశారు. ఇందులో బద్దం శంకర్‌రెడ్డి, అంగెటి తిరుపతిరెడ్డి, రాగి శ్రీను, భూక్య సక్రూలను అరెస్ట్‌ చేసి కరీంనగర్‌ జైలుకు తరలించారు. గురువారం పోలీసులు వారి చేతులకు సంకెళ్లు వేసి హుస్నాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. వారి రిమాండ్‌ను జడ్జి మరో 14 రోజులకు పొడిగించారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు, భూ నిర్వాసితులకు మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు కేవలం తమపైనే కేసులు నమోదు చేసి  కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని నిర్వాసిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దొంగతనం, సంఘ విద్రోహులు, హత్యనేరం చేసిన నిందితుల్లాగా భూ నిర్వాసితులకు సంకెళ్లు వేస్తారా..? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు డాక్యుమెంట్లు కోర్టులో సబ్మిట్‌ చేయకపోవడంతో తమ వాళ్లకి బేయిల్‌ రావడం లేదని వాపోయారు. 

బేడీలు వేయడం అమానుషం : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ 

గౌరవెల్లి రిజర్వాయర్‌ భూ నిర్వాసితులను బేడీలు వేసి కోర్టుకు తీసుకరావడం అమానుషమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి గురువారం రాత్రి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భూ నిర్వాసితులు హంతకులు కాదని, వారి హక్కుల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేశారే తప్పా ఎలాంటి నేరం చేయలేదని తెలిపారు. హంతకుల్లాగా గొలుసులు, బేడీలు వేయడమేమిటని ప్రశ్నించారు.


Updated Date - 2022-07-01T05:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising