ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేపీతండాలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-08-16T05:59:41+05:30

మండలంలోని జేపీతండాలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన నిధులతో చేపట్టనున్న పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి, అలాగే రాంపూర్‌ క్రాసింగ్‌ నుంచి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి హరీశ్‌రావు సోమవారం శంకుస్థాపన చేశారు.

జేపీతండాలో అదనపు గదుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంగునూరు, ఆగస్టు 15: మండలంలోని జేపీతండాలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన నిధులతో చేపట్టనున్న పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి, అలాగే రాంపూర్‌ క్రాసింగ్‌ నుంచి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి హరీశ్‌రావు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్‌ భిక్షపతినాయక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నవోదయ పాఠశాల ప్రవేశంలో వరుసగా మూడుసార్లు సీటు సాధించేలా కృషిచేసిన తండాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంగు రామకృష్ణను, ఉపాధ్యాయులు చంద్రంను మంత్రి హరీశ్‌రావు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన అభివృద్ధిపై క్లుప్తంగా వివరించారు. త్వరలోనే ఇంటి జాగా ఉన్న వాళ్లందరికీ ఇంటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భిక్షపతినాయక్‌, ఉపసర్పంచ్‌ ఆంజనేయులు, ఎంఈవో దేశిరెడ్డి, ఎంపీటీసీ జోత్స్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T05:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising