ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు పనులు షురూ

ABN, First Publish Date - 2022-10-08T05:22:52+05:30

గజ్వేల్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అన్నీ ఉన్నా బస్టాండ్‌ లేకపోవడంతో విమర్శకులు వెల్లువెత్తాయి. బస్టాండ్‌ ఏదీ అంటూ ప్రతిపక్షాలు నాలుగేళ్లుగా నోటికి పనిచేబుతూనేన్నారు. ఆధునిక హంగులతో రూ.5 కోట్ల ప్రాథమిక అంచనాతో గజ్వేల్‌ పట్టణానికి దూరంగా నిర్మించాలని తలపించగా శంకుస్థాపన చేసింది మొదలు అన్నీ అడ్డంకులే ఎదురయ్యాయి. భూసమస్యతో కోర్టు కేసుల్లో దాదాపుగా నాలుగేళ్ల పాటు నలిగిన బస్టాండ్‌ అంశం ఇటీవలే అరిష్టాలన్నీ దాటినట్లు కనిపిస్తుంది. నెల రోజుల వ్యవధిలో బస్టాండ్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

తూప్రాన్‌ రోడ్డులో నిర్మిస్తున్న బస్టాండ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరవేగంగా గజ్వేల్‌ మోడ్రన్‌ బస్టాండ్‌ నిర్మాణం

భూసమస్య, కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డంకులు

అన్ని దాటి రూ.5 కోట్ల అంచనాతో ప్రారంభం


గజ్వేల్‌, అక్టోబరు 7: గజ్వేల్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో  అభివృద్ధి చెందుతుంది. అన్నీ ఉన్నా బస్టాండ్‌ లేకపోవడంతో విమర్శకులు వెల్లువెత్తాయి. బస్టాండ్‌ ఏదీ అంటూ ప్రతిపక్షాలు నాలుగేళ్లుగా నోటికి పనిచేబుతూనేన్నారు. ఆధునిక హంగులతో రూ.5 కోట్ల ప్రాథమిక అంచనాతో గజ్వేల్‌ పట్టణానికి దూరంగా నిర్మించాలని తలపించగా శంకుస్థాపన చేసింది మొదలు అన్నీ అడ్డంకులే ఎదురయ్యాయి. భూసమస్యతో కోర్టు కేసుల్లో దాదాపుగా నాలుగేళ్ల పాటు నలిగిన బస్టాండ్‌ అంశం ఇటీవలే అరిష్టాలన్నీ దాటినట్లు కనిపిస్తుంది. నెల రోజుల వ్యవధిలో బస్టాండ్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.  


ఏడేళ్లుగా బస్టాండ్‌ లేని గజ్వేల్‌

గజ్వేల్‌ పట్టణంలోని బస్టాండ్‌ను 2015లో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కూల్చివేసి అధునాతన హంగులతో అదే స్థలంలో సమీకృత మార్కెట్‌ను నిర్మించారు. పక్కనే ఉన్న అథితిగృహాన్ని కూల్చివేసి, తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. దాదాపుగా ఏడు సంవత్సరాలుగా బస్టాండ్‌ లేకపోవడం, తాత్కాలిక బస్టాండ్‌లో సమస్యలు ఎదురవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదే క్రమంలో తూప్రాన్‌ రోడ్డులోని సెయింట్‌ పీటర్స్‌ పాఠశాల వద్ద బస్టాండ్‌కు కేటాయించిన రెండున్నర ఎకరాల స్థలంపై కోర్టులో కేసు పడడంతో బస్టాండ్‌ నిర్మాణం నిలిచిపోయింది. రెండు నెలల క్రితం స్థల వివాదం పరిష్కారం కావడంతో పనులు సాగుతున్నాయి. 

రెండున్నర ఎకరాల స్థలంలో ఆధునిక హంగులతో బస్టాండ్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రాథమికంగా రూ.5కోట్లను కేటాయించగా పనులు ప్రారంభమయ్యాయి. జీ ప్లస్‌ 1 పద్ధతిలో ఎనిమిది బస్‌ బేలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 20వేల అడుగుల విస్తీర్ణంలో బస్టాండ్‌ నిర్మాణం చేపట్టనున్నారు. షాపింగ్‌ కాంప్లెక్సు, మోడ్రన్‌ క్లాక్‌ టవర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మార్చి నాటికి బస్టాండ్‌ను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, పంచాయతీరాజ్‌ డీఈ అజయ్‌ తెలిపారు. 




Updated Date - 2022-10-08T05:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising