ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దవాగు నీటితో చెరువులు, కుంటలను నింపండి

ABN, First Publish Date - 2022-08-05T04:56:43+05:30

ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఖాతా-నంగునూరు పెద్దవాగు పొంగి ప్రవహిస్తుంటే ఇరిగేషన్‌ ద్వారా చెరువులు, కుంటలను నింపాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి  దేవులపల్లి యాదగిరి డిమాండ్‌

నంగునూరు, ఆగస్టు 4: ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఖాతా-నంగునూరు పెద్దవాగు పొంగి ప్రవహిస్తుంటే ఇరిగేషన్‌  ద్వారా చెరువులు, కుంటలను నింపాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి విమర్శించారు. దీంతో నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తుందన్నారు. గురువారం నంగునూరు మండలంలోని వాగు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. పెద్దాపురం నుంచి వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు, కుంటల్లోకి మళ్లించేందుకు పైప్‌లైన్‌ ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ పథకం నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎత్తిపోతల పథకం అధికార పార్టీ కాంట్రాక్టర్ల లాభాల కోసమే ఏర్పాటు చేశారు తప్ప రైతుల కోసం కాదని మండిపడ్డారు. పెద్ద వాగు ద్వారా వృథాగా వెళ్లే నీటిని చెరువులు కుంటల్లోకి మళ్లించి ఆయకట్టు రైతులకు సాగు మీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రాగుల కనకయ్య, చెలికాని యాదగిరి, అనరాజు నాగారాజు, గౌరబోయిన సంపత్‌, దాసరి కిషన్‌, జంగిటి శ్రీనివాస్‌, జాప తిరుపతి, జెమ్స్‌, కందికట్ల రాజు, గోనెపల్లి శివ, బంగారు నర్సింహులు, దేవులపల్లి శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T04:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising