ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే ఇంటింటి సర్వే

ABN, First Publish Date - 2022-01-25T05:48:37+05:30

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే ఫీవర్‌ సర్వేను చేపడుతున్నట్టు జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని 23వ వార్డులో సర్వే జరుగుతున్న తీరును సోమవారం సాయంత్రం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరం, కొవిడ్‌ లక్షణాలు ఉంటే కొవిడ్‌ కిట్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. పట్టణంలో అర్హులందరికీ ఇంటి వద్దనే రెండో డోసు టీకా ఇస్తున్నామన్నారు.

సిద్దిపేట పట్టణంలో ఫీవర్‌ సర్వే జరుగుతున్న తీరును తెలుసుకుంటున్న జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌


సిద్దిపేట టౌన్‌, జనవరి 24: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే ఫీవర్‌ సర్వేను చేపడుతున్నట్టు జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని 23వ వార్డులో సర్వే జరుగుతున్న తీరును సోమవారం సాయంత్రం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరం, కొవిడ్‌ లక్షణాలు ఉంటే కొవిడ్‌ కిట్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. పట్టణంలో అర్హులందరికీ ఇంటి వద్దనే రెండో డోసు టీకా ఇస్తున్నామన్నారు. అర్హులందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవలని సూచించారు. తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్‌, కమిషనర్‌ వార్డులో ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే సిబ్బంది వచ్చారా? కొవిడ్‌ టీకాలు తీసుకున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఏవైనా లక్షణాలు ఉంటే సిబ్బందికి సహకరిస్తూ వివరాలు తెలియజేయాలని కోరారు. అడిషనల్‌ హైదరాబాద్‌ రోడ్డులో వెళ్తుండగా చెత్త సేకరణ వాహనాన్ని ఆపి దుకాణాల నుంచి చెత్త సేకరిస్తున్నారా అని తెలుసుకున్నారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాహనాలను తొలగింప జేశారు. ఫుట్‌పాత్‌ ఆక్రమిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పట్టణంలో రోడ్ల పక్కన అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయనవెంట కౌన్సిలర్‌ నాయకం లక్ష్మణ్‌, ఆయా శాఖల సిబ్బంది మల్లికార్జున్‌, ఐలయ్య, మహేష్‌, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, సర్వే సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-01-25T05:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising