గిరిజన తండాలపై ఎక్సైజ్ దాడులు
ABN, First Publish Date - 2022-03-06T04:58:33+05:30
రామాయంపేట ఎక్సైజ్ శాఖ పరిధిలోని మాసాయిపేట మండలంలో గిరిజన తండాల్లో దాడులు చేపట్టారు.
రామాయంపేట, మార్చి 5: రామాయంపేట ఎక్సైజ్ శాఖ పరిధిలోని మాసాయిపేట మండలంలో గిరిజన తండాల్లో దాడులు చేపట్టారు. స్థానిక ఎక్సైజ్ సీఐ జయసుధ నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం గిరిజన తండాల్లో తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలోని తండాల్లో గుడుంబా తయారీ, గంజాయిలాంటివి ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఉదయం 2 గంటల పాటు సోదాలు నిర్వహించగా ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు.
Updated Date - 2022-03-06T04:58:33+05:30 IST