ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబూ జగ్జీవన్‌రామ్‌ను ప్రతీఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-07-07T04:58:26+05:30

డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ను ప్రతీఒక్కరు ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని దుబ్బాక మున్సిపల్‌ చైర్మన్‌ గన్నె వనితా భూంరెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాకలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ సంఘం అధ్యక్షుడు ఎల్లం ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని నిర్వహించారు.

దుబ్బాకలో బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వనితాభూంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితాభూంరెడ్డి

దుబ్బాక/మిరుదొడ్డి, జూలై 6: డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ను ప్రతీఒక్కరు ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని దుబ్బాక మున్సిపల్‌ చైర్మన్‌ గన్నె వనితా భూంరెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాకలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ సంఘం అధ్యక్షుడు ఎల్లం ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు బాలేష్‌ గౌడ్‌, ప్రవీణ్‌, భాస్కర్‌ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలవేశారు. అలాగే మిరుదొడ్డి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో టీఆర్‌ఎస్‌ నాయకుడు, సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, రాధాకృష్ణ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కల్పన, ఆసస్వామి పాల్గొన్నారు. 

చిన్నకోడూరు: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బాబూ జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి అభినందనీయమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యువజన సంఘం జిల్లా నాయకుడు గుడుమల్ల రాజలింగం అన్నారు. బుధవారం జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని చిన్నకోడూరులో సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యువజన సంఘం జిల్లా నాయకులు కనకరాజు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

మద్దూరు: దూళిమిట్ట మండల కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశ ప్రథమ కార్మికశాఖా మంత్రిగా, ఉప ప్రధానిగా బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు ధరావత్‌ భిక్షపతినాయక్‌, బీజేవైఎం జిల్లా కార్యదర్శి సోగాల మనోజ్‌, బీజేవైఎం మండలాధ్యక్షుడు యామ శ్రీకాంత్‌ పాల్గొన్నారు. అలాగే మద్దూరులో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ 121వ జయంతిని పురస్కరించుకుని బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

నంగునూరు: నంగునూరు మండల కేంద్రంతో పాటు పాల మాకుల, నర్మెట్టతో పాటు వివిధ గ్రామాల్లో బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

చేర్యాల: డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని బుధవారం చేర్యాలలో ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు భూమిగారి రాజేందర్‌ తదితరులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుంచు యాదగిరి, కర్రోల్ల యాదగిరి, పాకాల అనిల్‌, భూమిగారి దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు. 

గజ్వేల్‌: బీజేపీది అధికార యావ తప్ప ప్రజాకాంక్ష లేదని డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పీ.శంకర్‌ అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని జగ్జీవన్‌రామ్‌ చౌరస్తాలో మాజీ ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

Updated Date - 2022-07-07T04:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising