ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలి: ఎంపీ

ABN, First Publish Date - 2022-10-02T04:45:48+05:30

ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

మిరుదొడ్డిలో దుర్గాదేవి వద్ద ప్రత్యేక పూజలను చేస్తున్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిరుదొడ్డి/కొండపాక/వర్గల్‌/చేర్యాల/దౌల్తాబాద్‌/గజ్వేల్‌ రూరల్‌, అక్టోబరు 1: ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మిరుదొడ్డితోపాటు మండలంలోని కొండాపూర్‌ గ్రామాల్లో దుర్గాదేవి మండపాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం కొండాపూర్‌ గ్రామంలో మొక్కను నాటారు. అలాగే మిరుదొడ్డి బాధితులకు సీఎంఆర్‌ చెక్కులను అందజేశారు. ఆయనవెంట మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటయ్య, ఆత్మకమిటీ చైర్మన్‌ భాస్కరచారి, ఏఎంసీ చైర్మన్‌ సత్యనాయణ, టెలికాంబోర్టు సభ్యుడు సుధీర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఛత్రపతి శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాతోత్సవాల సంఘంగా శనివారం మహిళలు కుంకుమార్చన చేశారు. అలాగే అన్నదానం నిర్వహించారు. అలాగే కుకునూరుపల్లిలోని భీష్మ గంగపుత్ర అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత విగ్రహానికి కరెన్సీ నోట్లతో అలంకరించారు. వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా విద్యా సరస్వతి అమ్మవారిని శనివారం డీసీసీబీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నర్సారెడ్డి దంపతులను అమ్మవారి శేషవస్త్రంతో ఘనంగా సన్మానించారు. అనంతరం వేదపండితులు వేదమంత్రోశ్ఛరణలతో ఆశీర్వచనం చేశారు. దుర్గాదేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని చేర్యాల పట్టణంలోని చావడి వద్ద దేవీ స్నేహాయూత్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. సాయంత్రం శివలింగం, త్రిశూలం, ఢమరుకం ఆకృతిలో జ్యోతులను అలంకరించి దీపాలు వెలిగించారు. వేణుగోపాలస్వామి ఆలయ వీధిలో సాయి చైతన్య యూత్‌, రాజీవ్‌నగర్‌ కాలనీలో సామూహిక కుంకుమార్చన , అన్నదానం నిర్వహించగా, మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని పూజించారు. అయ్యప్పస్వామి ఆలయంలో విశేష దీపాలంకరణ చేశారు. చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని భవాని రుద్రేశ్వరాలయాన్ని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శనివారం రాత్రి సందర్శించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో శ్రీవెంకటేశ ఆలయ ఆవరణలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రణం శ్రీనివా్‌సగౌడ్‌ పూజలు నిర్వహించారు. గజ్వేల్‌లోని శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో గల సంతోషిమాత మందిరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారు అర్ధనారీశ్వరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పాత బస్తీలో వాయునంద యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద నిర్వహించిన సామూహిక కుంకుమార్చనల్లో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T04:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising