ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టే ఉత్తర్వులు అమలు చేసి పరిశ్రమ పనులు ఆపండి

ABN, First Publish Date - 2022-12-15T23:56:09+05:30

మండల సభలో అసైన్డ్‌ రైతుల వినతి

వినతిపత్రాన్ని అందజేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిన్నారం, డిసెంబరు 15: జిన్నారంలో అసైన్డ్‌ భూములపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను అమలు చేసి, పరిశ్రమ పనులను నిలిపివేయాలని మండల సభలో రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. గురువారం ఎంపీపీ రవీందర్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్‌ సమావేశంలో జడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సభ్యులు కోరారు. కాలుష్య జలాలు విడుదల చేస్తున్న పరిశ్రమల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, జడ్పీటీసీ ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రసాయనాల ట్యాంకర్లను నిబంధనలకు విరుద్ధంగా పంపిన స్పార్క్‌ల్యాబ్‌, హైగ్రో పరిశ్రమలకు మూసివేత ఉత్తర్వులు ఇచ్చామని పీసీబీ ఏఈ కుమార్‌ పాఠక్‌ తెలిపారు. ఈ క్రమంలోనే జిన్నారం సర్వే నంబర్‌ 1లో అసైన్డ్‌ భూములపై హైకోర్టు స్టే ఇచ్చినా అక్కడ పరిశ్రమ ఏర్పాటు కోసం పనులు జరుగుతున్నాయని సభలోకి వచ్చిన రైతులు తెలిపారు. వాటిని నిలిపివేయాలని నాయకులకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా రైతులు సభను అడ్డుకుంటారని పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎంపీడీవో రాములు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising