ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-08-04T06:07:29+05:30

ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా పోలీసు, కోర్టు అధికారులతో పాటు న్యాయవాదులు కృషి చేయాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జలీల్‌ కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అబ్దుల్‌ జలీల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 3: ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా పోలీసు, కోర్టు అధికారులతో పాటు న్యాయవాదులు కృషి చేయాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జలీల్‌ కోరారు. సంగారెడ్డి జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు అధికారులు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలతో బుధవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. క్రిమినల్‌ కాంపౌండేబుల్‌, చెక్‌ బౌన్స్‌ కేసులు, బ్యాంకు రికవరీ, మోటార్‌ వాహన ప్రమాద నష్టపరిహారం, కుటుంబ, వివాహ తగాదాలు, భూ సేకరణ తదితర కేసులు పరిష్కరించనున్నట్టు తెలిపారు. స్పెషల్‌ ఎక్సైజ్‌ కోర్టు జడ్జి హన్మంతరావు మాట్లాడుతూ కక్షిదారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ కేసులను రాజీ మార్గాన పరిష్కరించుకొనే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో స్పెషల్‌ మొబైల్‌ కోర్టు జడ్జి నిర్మల పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-04T06:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising