ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-03-06T05:05:29+05:30

గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు.

కోహెడ మండలం నాగసముద్రాలలో సీసీరోడ్ల పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కన్నపేట/కోహెడ, మార్చి 5 : గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. శనివారం అక్కన్నపేట మండలం కపూర్‌నాయక్‌తండాలో గిరిజన రైతులకు మంజూరైన వ్యవసాయ బోరు బావులకు భూమి పూజచేసి ప్రారంభించి మాట్లాడారు. గిరిజన తండాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. నియోజకవర్గంలో తారు రోడ్డు నిర్మాణాల కోసం రూ.110 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. హుస్నాబాద్‌లో రూ.2 కోట్లతో బంజారా భవన్‌ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ చైర్మన్‌ అశోక్‌బాబు, సర్పంచ్‌ బానోత్‌ సంతో్‌షనాయక్‌ పాల్గొన్నారు. కోహెడ మండలం నాగసముద్రాలలో రూ.33 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు పనులు రూ.10 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, మోడల్‌ స్కూల్‌లో వంటగదిని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ప్రారంభించారు. అలాగే ధర్మసాగర్‌పల్లిలో రూ.20 లక్షల సీసీరోడ్డు పనులు, వైకుంఠధామం, ఎర్రగుంటపల్లిలో రూ.50 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీపీ కొక్కుల కీర్తిసురేష్‌, జడ్పీటీసీ శ్యామల, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T05:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising