‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2022-08-05T05:18:06+05:30
దళితబంధుతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.
నారాయణఖేడ్, ఆగస్టు 4: దళితబంధుతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని రుద్రార్‌లో దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన తొమ్మిది పాడి యూనిట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం చరిత్రాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడన్నారు. రుద్రార్‌లో 95 దళిత యూనిట్లు అన్ని విభాగాలు కలిపి ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పాడికి సంబంధించి తొమ్మిది యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంతో వారికి షెడ్లతో పాటు పాడి గేదెలను కొనుగోలు చేయించి ఇప్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రుద్రార్ గ్రామ సర్పంచ్ సువర్ణప్రభాకర్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సత్యపాల్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాం
నారాయణఖేడ్, ఆగస్టు 4: ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ తాము వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 46 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.17 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రుబీనాబేగంనజీబ్, వైస్ చైర్మన్ పరశురాం పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
నారాయణఖేడ్, ఆగస్టు 4: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ద్వారా మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును నారాయణఖేడ్‌లో టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి లబ్ధిదారుడు కల్హేర్ మండలం రాంరెడ్డిపేటకు చెందిన దుర్గయ్యకు అందజేశారు.
Updated Date - 2022-08-05T05:18:06+05:30 IST