ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ర్యాగింగ్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దు

ABN, First Publish Date - 2022-05-21T05:07:33+05:30

డాక్టర్‌ వృత్తి పవిత్రమైనదని, ర్యాగింగ్‌ పేరుతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ శ్వేత సూచించారు.

అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీ శ్వేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విద్యార్థులకు సిద్దిపేట సీపీ శ్వేత సూచన


ములుగు, మే 20: డాక్టర్‌ వృత్తి పవిత్రమైనదని, ర్యాగింగ్‌ పేరుతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ శ్వేత సూచించారు. శుక్రవారం ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ రీసర్చ్‌ సెంటర్‌లో మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న మెడికల్‌ విద్యార్థులకు సేఫ్‌ అండ్‌ సెక్యూరిటీ, ర్యాగింగ్‌ చట్టాలపై పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా రాణించాలని సూచించారు. కాలేజీలో అన్ని రకాల రక్షణ చర్యలు కల్పిస్తామని చెప్పారు. చట్టాల గురించి ప్రతీ ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని కోరారు. కాగా మానసిక ఒత్తిడితో బాధపడే వారి కోసం ఆర్వీఎం ఆస్పత్రి వారు అందించే సేవలకు సంబంధించిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 9133343743ను సీపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్వీఎం ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ యాకయ్య, డాక్టర్‌ రాజేందర్‌, డైరెక్టర్‌ శ్రవణ్‌, డీన్‌ హేమంత్‌రావు, కాలేజీ ప్రిన్సిపాల్‌ గోపికృష్ణ, డైరెక్టర్‌ శ్రీనివాస్‌, సీఈవో నరసయ్య, డీఎస్పీ రిటెర్డ్‌ అడ్వైజర్‌ స్వామి పాల్గొన్నారు.


 

Updated Date - 2022-05-21T05:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising