ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

ABN, First Publish Date - 2022-02-20T05:24:19+05:30

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు

ఏడుపాయలలో జాతర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 

 

పాపన్నపేట: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏడుపాయల జాతర ఏర్పాట్లపై పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లిలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్సీ శేరీ సుభా్‌షరెడ్డి, అదనపు కలెక్టర్‌ రమే్‌షతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 1న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏడుపాయల జాతరకు తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి ఘటనలకు తావివ్వకుండా ఈనెల 26లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశించారు.జాతరలో వివిధ శాఖలు వారు చేపట్టే కార్యక్రమాలు, వాటి ప్రగతిని తెలుసుకుంటూ ఆమె పలు సూచనలు చేశారు. జాతరకు రెండు విడతలుగా 0.45టీఎంసీ నీటిని విధుల చేయిస్తామని ఆమె తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు సాయిరాం, వెంకట ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ చందనా ప్రశాంత్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-20T05:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising