ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబరాన్నంటిన వజ్రోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-15T05:22:32+05:30

సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద ఓపెన్‌ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి.

కోమటిచెరువు వద్ద స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలిస్తున్న కళాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

 హాజరైన సినీహీరో జొన్నలగడ్డ సిద్ధూ


సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 14: సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద ఓపెన్‌ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి. దేశభక్తి గీతాలపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. జానపద గాయని కనకవ్వ తన పాటలతో అలరించారు. మై విలేజ్‌ షో ఫేం అనిల్‌ సభనుద్దేశించి మాట్లాడారు. కోమటిచెరువు వద్ద నిర్మించిన నెక్లెస్‌ రోడ్డు రెండవ దశను సినీహీరో జొన్నలగడ్డ సిద్ధూ(డీజే టిల్లు)తో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. చెరువు కట్టపై 360 డిగ్రీ సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధూ మంత్రి హరీశ్‌రావుతో సెల్ఫీ దిగారు. హార్డ్‌వర్కర్‌ అయిన మంత్రి హరీశ్‌రావు కృషి వల్లే సిద్దిపేట అభివృద్ధి చెందిందని, సిద్దిపేట అభివృద్ధిని చదివానని ఇప్పుడు స్వయంగా చూస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట మంచి పర్యాటకరంగంగా అభివృద్ధి చెందిందని, చెరువు కట్టపై వాకింగ్‌ చేసేందుకు వాకింగ్‌ ట్రాకింగ్‌ నిర్మించడం అభినందనీయమని ఆయన అన్నారు. 

 



Updated Date - 2022-08-15T05:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising