ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల ధర్నా

ABN, First Publish Date - 2022-08-18T04:36:14+05:30

హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు బుధవారం ధర్నా నిర్వహించారు.

హుస్నాబాద్‌ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పిస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌, ఆగస్టు 17: హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు బుధవారం ధర్నా నిర్వహించారు. దీనికి డివిజన్‌లోని వీఆర్‌ఏలు భారీగా తరలివచ్చారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ముందు పట్టణంలో ర్యాలీ జరిపారు. అనంతరం ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 24 రోజులుగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వీఆర్‌ఏ జేఏసీ గౌరవాధ్యక్షుడు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు బోనగిరి సమ్మయ్య, నిరటి వెంకటస్వామి, మాచర్ల భవాని, బండ మహేందర్‌, రాజు, బాలమల్లయ్య, భూపాల్‌, వంగప్లి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

గజ్వేల్‌: వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వీఆర్‌ఏల సంఘం డివిజన్‌ అధ్యక్షుడు నిరుడి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. 24 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలు బుధవారం గజ్వేల్‌ పట్టణంలోని ఐవోసీలోని ఆర్డీవో కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం నాయకులు బాలయ్య, హరిబాబు, రఘువరన్‌, పూదరి రవి, శ్రీనివాస్‌, ప్రశాంత్‌ న్నారు. 

Updated Date - 2022-08-18T04:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising