ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నిరంగాల్లో హుస్నాబాద్‌ పట్టణ అభివృద్ధి: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-11-04T23:20:03+05:30

హుస్నాబాద్‌, నవంబరు 4: హుస్నాబాద్‌ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌, నవంబరు 4: హుస్నాబాద్‌ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో రెండుసార్లు హుస్నాబాద్‌ పట్టణానికి జాతీయస్థాయి అవార్డులు వచ్చాయన్నారు. పట్టణ అభివృద్ధికి గతేడాది రూ.20 కోట్లు మంజూరయ్యాయని, ఈ ఏడాది రూ.12 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కాశీనగర్‌, రావుస్‌ కాలనీ, హనుమాన్‌నగర్‌, ఎల్లమ్మగుడి ప్రాంతాల్లో సీసీరోడ్డు, మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అనంతరం హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, కమిషనర్‌ రాజమల్లయ్య, ఎంపీపీలు మానస, కొక్కుల కీర్తి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కర్ర శ్రీహరి, కౌన్సిలర్లు జనగామ రత్నమాల, పెరుక భాగ్యరెడ్డి, వాల సుప్రజ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-04T23:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising