ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఈవో రవికాంతారావును సస్పెండ్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-07-06T05:21:15+05:30

అవినీతికి పాల్పడిన హుస్నాబాద్‌ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీదేవికి జిల్లా విద్యాధికారి రవికాంతారావు ఎలాంటి చర్యలు చేపట్టకుండా వత్తాసు పలుకుతున్నారని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు.

హుస్నాబాద్‌లో డీఈవో దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌రూరల్‌, జూలై 5: అవినీతికి పాల్పడిన హుస్నాబాద్‌ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీదేవికి జిల్లా విద్యాధికారి రవికాంతారావు ఎలాంటి చర్యలు చేపట్టకుండా వత్తాసు పలుకుతున్నారని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో డీఈవో దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేరిపోతుల జనార్ధన్‌, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర నాయకుడు గుగులోతు శివరాజర్‌ మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌ అవినీతిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజామబాద్‌ జిల్లా బాల్‌కొండ పాఠశాలకు బదిలీ చేయగా, ప్రిన్సిపాల్‌ అక్కడి వెళ్లకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని తిరిగి హుస్నాబాద్‌ మోడల్‌ స్కూల్‌లో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌కు వత్తాసు పలుకుతున్న డీఈవోను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కనగంటి నరేష్‌, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కర్ణకంటి నరేష్‌, ఎస్‌ఎ్‌పఫ్‌ జిల్లా కార్యదర్శి గుగులోతు రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising