ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల తెలంగాణగా మార్చారు

ABN, First Publish Date - 2022-05-23T05:05:51+05:30

బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ నేతలు చివరకు అప్పుల తెలంగాణగా మార్చారని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

అల్గోల్‌లో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


జహీరాబాద్‌, మే22: బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ నేతలు చివరకు అప్పుల తెలంగాణగా మార్చారని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో ఆదివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసపూరిత వాగ్ధానాలు చేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి అప్పుల తెలంగాణగా మార్చారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. దళితులకు ఇస్తామని చెప్పిన మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు సంఘర్షణ సభా వేదికగా వరంగల్‌ డిక్లరేషన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలన్నారు.  అంతకు ముందు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మలాజగ్గారెడ్డి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేసి, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే రైతు డిక్టరేషన్‌ను వివరించాలని చెప్పారు. అనంతరం రైతు డిక్లరేషన్‌ను చదివి వినిపించారు. కార్యక్రమంలో జహీరాబాద్‌, కోహీర్‌ ఎంపీపీలు గిరిధర్‌రెడ్డి, మాధవి, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు హన్మంతరావుపాటిల్‌, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రామలింగారెడ్డి, కండెం నర్సింహులు, నాయకులు మహ్మద్‌ మాక్సుద్‌, జడ్పీటీసీలు నాగిశెట్టి రాథోడ్‌, వినిల నరేశ్‌, భాస్కర్‌రెడ్డి, భీమయ్య గోపాల్‌, వైస్‌ షాకిర్‌అలీ, రాములు, సర్పంచులు నర్సింహారెడ్డి, జ్యోతి మోహన్‌, ఎంపీటీసీలు స్వరూప తుకారం, మల్లారెడ్డి, లాజర్‌, నర్సింహులు, మల్లికార్జున్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శుక్లవర్ధన్‌రెడ్డి, మహ్మద్‌ మోయిజ్‌, బ్లాక్‌ మొబీన్‌ జెమిలుద్దీన్‌, అక్బర్‌ హుస్సేన్‌, హర్షద్‌ పటేల్‌, నరే్‌శ్‌ గౌడ్‌, జాఫర్‌,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising