తెలంగాణ గర్వించదగ్గ కవి దాశరథి
ABN, First Publish Date - 2022-07-23T05:16:00+05:30
నిజాం వ్యతిరేక రచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన దాశరథి తెలంగాణ గర్వించదగ్గ కవి అని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి అన్నారు.
సిద్దిపేట, జూలై 22: నిజాం వ్యతిరేక రచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన దాశరథి తెలంగాణ గర్వించదగ్గ కవి అని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి అన్నారు. దాశరథి జయంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోటిరతనాల వీణ తెలంగాణ అని ఎలుగెత్తిన దాశరథి చిరస్మరణీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం, బస్వ రాజ్‌కుమార్, శ్రీచరణ్ సాయిదాస్ తదితరులు పాల్గొన్నారు.
చేర్యాల: కొమురవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతిని శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిన్నింటి రత్నం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి దాశరథి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లత, స్వామి, పాల్గొన్నారు.
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దాశరథి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పీవీ.ఉమాశశి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గీతాంజలి, అధ్యాపకులు అనిత, ఉమారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-23T05:16:00+05:30 IST