ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకరంగా రోడ్డుపై గుంతలు

ABN, First Publish Date - 2022-06-27T05:10:54+05:30

చేర్యాల పట్టణం, రూరల్‌ మండలం, కొమురవెల్లి మండలంలోని పలు గ్రామాలమీదుగా గల జనగామ-సిద్దిపేట జాతీయ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.

చేర్యాల రైతుబజారు సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


చేర్యాల, జూన్‌ 26: చేర్యాల పట్టణం, రూరల్‌ మండలం, కొమురవెల్లి మండలంలోని పలు గ్రామాలమీదుగా గల జనగామ-సిద్దిపేట జాతీయ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలలో ఎక్కడ చూసినా లోతైన గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. వర్షాలకు ఆ గుంతల్లో వర్షపు నీరు నిలడంతో రాత్రివేళ ప్రమాదాలు జరుగుతున్నాయి. గుర్జకుంట వాగు, లెనిన్‌నగర్‌, మర్రిముచ్ఛాల, ముస్త్యాల, వీరన్నపేట గ్రామాల శివారుల్లో రోడ్డు దెబ్బతింది. అయితే సూర్యాపేట నుంచి దుద్దెడ వరకు నాలుగులైన్ల రోడ్డునిర్మాణానికి కొన్నినెలలక్రితం రూ.430కోట్లుపైగా నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ ప్రారంభించలేదు. రహదారి విస్తరణ పనుల నిర్వహణకు మరింత సమయం పట్టనున్నా రోడ్ల తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడంలేదు. ప్రాణాలు పోతేగానీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించరా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.


 

Updated Date - 2022-06-27T05:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising