దెబ్బతింటున్న పంటలు.. ఆందోళనలో రైతులు
ABN, First Publish Date - 2022-08-05T05:00:06+05:30
చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి.
3 చేర్యాలలో దెబ్బతిన్న మొక్కజొన్న
చేర్యాల, ఆగస్టు 8: చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. వరదనీరు పొలాల్లో నిల్వ ఉండడంతో మక్క, పత్తి చేలు ఎర్రబారి ఎదగడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోహిణిలో సమృద్ధిగా వ ర్షాలు కురవడంతో విత్తనాలు వేశారు. అయితే వరుసగా వర్షాలు దంచికొడుతుండడంతో కొన్ని పొలాలు నీట మునిగాయి. కొన్ని పొలాల్లో ఇసుకమేట వేశాయి. పొలంలో నీటితేమ పోయేందుకు ఎరువులు వేస్తున్నా తిరిగి వర్షం కురుస్తుండడంతో పెట్టుబడి భారమవడంతో పాటు పంటలు కోల్పోవాల్సిన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నష్టం అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2022-08-05T05:00:06+05:30 IST