ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ డివిజన్‌ సాధన పోరాటంలో సీపీఎంది కీలక భూమిక

ABN, First Publish Date - 2022-07-02T05:04:15+05:30

చేర్యాల రెవెన్యూ డివిజన్‌ సాధన పోరాటంలో కీలక భూమిక షోషించడమే కాకుండా ముందస్తుగా గ్రామసభ తీర్మానం చేసింది సీపీఎం సర్పంచులేనని, పలువురు వ్యక్తులు తమ ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేయడం తగదని సీపీ ఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి

చేర్యాల, జూలై 1: చేర్యాల రెవెన్యూ డివిజన్‌ సాధన పోరాటంలో కీలక భూమిక షోషించడమే కాకుండా ముందస్తుగా గ్రామసభ తీర్మానం చేసింది సీపీఎం సర్పంచులేనని, పలువురు వ్యక్తులు తమ ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేయడం తగదని సీపీ ఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించి అనేక సమస్యలు పరిష్కరించిన చరిత్ర సీపీఎందన్నారు. చేర్యాల ప్రాంత ప్రజల మనోభీష్టం కోసం పోరాడి ప్రజాప్రతినిధులలో చలనం తీసుకొచ్చామని చెప్పారు. సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరిత వ్యక్తులతో కలిసి సీపీఎం పనిచేయదన్నారు. రెవెన్యూ డివిజన్‌ సాధించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, బద్దిపడిగ కృష్ణారెడ్డి, చెరుకు రమణారెడ్డి, తాడూరి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising